అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

అర్హులైన పేదప్రజలందరికీ నూటికి నూరుశాతం రాష్ట్ర సంక్షేమ పథకాలు అందుతాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

Update: 2024-11-09 08:54 GMT

దిశ,మణుగూరు : అర్హులైన పేదప్రజలందరికీ నూటికి నూరుశాతం రాష్ట్ర సంక్షేమ పథకాలు అందుతాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మణుగూరు మండలంలోని విప్పల సింగారంలో తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎమ్డీఓ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించారు. అనంతరం అధికారులు ఎమ్మెల్యే పాయంకు పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. తరువాత అధికారులు చేస్తున్న కుటుంబ సర్వేను దగ్గరుండి పరిశీలించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు దరిచేరాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ప్రవేశ పెట్టిందని తెలిపారు.పేదలకు రాజకీయంగా,ఆర్థికంగా సామాజికంగా ప్రయోజనాలు కల్పించేందుకు సర్వే ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ప్రజలు అధికారులకు పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పీరాణాకి నవీన్, మండల నాయకులు, తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎమ్డీఓ శ్రీనివాస్ రావు, ఎంపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


Similar News