పొట్టు పొట్టుగా కొట్టుకున్న విద్యార్థులు

ఖమ్మం నగరంలోని ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో నిర్వహిస్తున్న పోస్ట్ మెట్రిక్ వసతి గృహం (ఏ) లో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.

Update: 2024-11-28 10:02 GMT

దిశ, ఖమ్మం ఎడ్యుకేషన్ : ఖమ్మం నగరంలోని ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో నిర్వహిస్తున్న పోస్ట్ మెట్రిక్ వసతి గృహం (ఏ) లో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఖమ్మంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు 250 మంది ఈ వసతి గృహంలో బస చేస్తున్నారు. ఎస్సీ పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహం (ఏ) లో మంగళవారం కొంతమంది విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    ఈ ఘర్షణలో విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఆ దృశ్యాలు చూసినవారు వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. విధుల పట్ల సంక్షేమ అధికారి తీరు ఈ ఘటనతో బయటపడింది. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకొని వసతి గృహాల్లో ఇటువంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు కోరుతున్నారు. 


Similar News