కర్ణాటకలో నిలబెట్టుకున్నాం... తెలంగాణలోనూ నిలబెట్టుకుంటాం
బెదిరించి తీసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నయని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
దిశ, నేలకొండపల్లి : బెదిరించి తీసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నయని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండల పరిధిలోని ఓ పంక్షన్ లో మంగళవారం జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. తొలుత మండల పర్యటనకు విచ్చేసిన పొంగులేటికి బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ నువ్వేదో పొడుస్తావని నిన్ను పాలేరు ప్రజలు ఎమ్మెల్యే గా గెలిపించలేదని, అప్పనంగా వచ్చిన డబ్బులతో విర్రవీగాలని చూస్తున్నావని స్థానిక ఎమ్మెల్యేని ఉద్దేశించి అన్నారు.
నీ ఉడుత ఊపులకు ఎవరూ భయపడరని అన్నారు. కాంగ్రెస్ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలను బెదిరించి భయపెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్తున్నారని అన్నారు. మీరు తీసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు మీ వెంట ఉంటారో ఉందరో చూద్దాం అన్నారు. వారంతా మళ్లీ సొంత గూటికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నయని తెలియజేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాగానే ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తామన్నారు. అనంతరం వివిధ మండలాల్లోని గ్రామాల నుంచి 1500 మంది పార్టీలోకి చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్క కార్యకర్తపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి,
జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ లు బచ్చలకూర జ్యోతి, కోండ్రు విజయలక్ష్మి, రామకృష్ణ, మాగి పుల్లయ్య, ఈపూరి సుజాత, ఎంపీటీసీ లు ఉసిరికాయల లక్ష్మయ్య, కట్టెకోల సుధాకర్, మాజీ జెడ్పీటీసీ లు మీసా ముత్తయ్య, కుక్కల హనుమంతరావు, సీనియర్ నాయకులు చాగంటి నారాయణ, ఆరెకట్ల గురవయ్య, దండా సత్యనారాయణ,మాజీ సర్పంచ్ లక్కం ఏడుకొండలు, వార్డు మెంబర్లు బుజ్జిమళ్ల హైమవతి, నిమ్మగడ్డ గౌరీ, పి.నాగిరెడ్డి, వాకా బేబి, చిదుముల మానస, చిలకల సీతారావమ్మ, నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు, చెర్వు స్వర్ణ, వాకా శ్రీనాథ్, మామిడి వెంకన్న, జాన్ రెడ్డి, రాయపూడి నారాయణ రావు, శ్రీను, ముక్కంటి, కన్నయ్య, రామరావు, మోహన్ రెడ్డి, లక్ష్మినారాయణ, శ్రీనివాసరావు, సైదులు, వాసు, కన్నా రెడ్డి, ఖాజా తదితరులు ఉన్నారు.