కేసీఆర్ రావణాసురుడు కాదు.. నరకాసురుడు: మువ్వా విజయ్ బాబు

తాతా మధు నువ్వు కొత్తపెళ్లి కొడుకువి.. పాతబడ్డ కొద్దీ తెలుస్తుంది నీకు మీ బాస్ కేసీఆర్ దురహంకారం.. తినబోతూ రుచేందుకు, వెయిట్ అండ్ సీ.. అని మువ్వా విజయ్ బాబు అన్నారు.

Update: 2023-04-12 08:16 GMT

దిశ బ్యూరో, ఖమ్మం: తాతా మధు నువ్వు కొత్తపెళ్లి కొడుకువి.. పాతబడ్డ కొద్దీ తెలుస్తుంది నీకు మీ బాస్ కేసీఆర్ దురహంకారం.. తినబోతూ రుచేందుకు, వెయిట్ అండ్ సీ.. అని మువ్వా విజయ్ బాబు అన్నారు. బుధవారం పొంగులేటి క్యాంప్ ఆఫీస్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు నువ్వు పొగుడుతున్న నోటితోనే మళ్లీ సీఎం కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీని విమర్శించే రోజులు వస్తాయి.. అవి ఎంతో దూరంలో లేవు అన్నారు. తాతా మధు నువ్వు అన్నదే నిజం.. కేసీఆర్ రావణసురుడు కాదు.. నరకాసురుడు.. ఆయన్ను, ఆయన పార్టీని వధించి రాష్ట్రమంతా దీపావళి చేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు. అన్ని అధికార పదవులకు మా సభ్యులంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

మీరు కూడా మీకున్న పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా...? మీరో మేమో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. పొంగులేటి శీనన్న ది చెడ్డీ గ్యాంగ్ అయితే మీది స్టువర్ట్ పురం గ్యాంగ్.. కూకట్ పల్లిలో ఆస్తులను కాపాడుకునేందుకు కేటీఆర్‌కు అందులో వాటా ఇచ్చి ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం రాష్ట్రం యావత్తు తెలియంది కాదా? గాయత్రి రవి అక్రమ గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తు కోట్లు దండుకుంటున్నాడని రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అధికార విచక్షణతో దాడులు జరుపుతుంటే వాటి నుంచి బయటపడేందుకు కేసీఆర్ కాళ్లు మొక్కి బీఆర్ఎస్‌లో చేరింది నిజం కాదా...? అంటూ ప్రశ్నించారు.

సత్తుపల్లి నుంచే పతనం ప్రారంభం

రేగా కాంతారావు..గెస్ట్ పాత్ర పోషించేంది నువ్వేనని, శీనన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ ఓ కుటుంబ సభ్యుడన్నారు. నువ్వు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఏ నాడైన ఒక్కరంటే ఒక్కరికి నేనున్నా అనే భరోసా ఇచ్చావా అని మువ్వా ప్రశ్నించారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశారు అని మాట్లాడుతున్న లింగాల కమల్ రాజు నువ్వు ఎర్ర కండువా పార్టీలో ఉంటే వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని నిన్ను చేరదీసి జెడ్పీటీసీ‌గా గెలిపించి జెడ్పీచైర్మన్ ను చేస్తే కన్నతండ్రి లాంటి శీనన్నకు చేసింది ద్రోహం కాదా అంటూ ఫైర్ అయ్యారు.

సండ్ర గారు... మీరు మూడు సార్లు కాదు ఆ నియోజకవర్గానికి ముప్పై సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదు. పార్టీ పదవుల్లో లేకపోయినా ఆ నియోజకవర్గానికి శ్రీనివాస్ రెడ్డి ఏం చేశారో అక్కడి ప్రజలకు బాగా తెలుసన్నారు. రాసిపెట్టుకోండి. బీఆర్ఎస్ పతనం సత్తుపల్లి నుంచే మొదలుకాబోతుందంటూ హెచ్చరించారు. మువ్వా విజయ్ బాబు వెంట మద్దినేని స్వర్ణకుమారి, కోట రాంబాబు, కార్పొరేటర్ నగేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News