టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆఫ్జల్‌ హాసన్‌ ఆత్మహత్యాయత్నం?

టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హాసన్ ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు.

Update: 2024-07-07 12:14 GMT

దిశ, ఖమ్మం : టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హాసన్ ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఖమ్మం నగరంలోని తన నివాసంలో శనివారం రాత్రి బీపీ ట్యాబ్లెట్ తో పాటు నిద్రమాత్రలు అధిక మోతాదులో మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు తెలుస్తోంది. వెంటనే బందువులు, స్నేహితులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఆయన అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు.

     ప్రస్తుతం ఆరోగ్యం కొద్దిగా నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా గత కొన్ని నెలల క్రితం ఓ స్థలం రిజిస్ట్రేషన్ విషయం లో అఫ్జల్ హాసన్ హస్తం ఉందని ఖమ్మం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం బెల్ పై బయటకు వచ్చారు. ఆయనపై మరో కేసు నమోదు చేసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అఫ్జల్ హాసన్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు అని తెలుస్తోంది. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉందని బంధువులు చెబుతున్నారు.


Similar News