సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు

సత్తుపల్లి పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియ బహుళ ప్రయోజనాలు కలిగిస్తుందని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చేందుకే ఈ కార్డు దోహదపడుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.

Update: 2024-10-05 14:38 GMT

దిశ,సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియ బహుళ ప్రయోజనాలు కలిగిస్తుందని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చేందుకు ఈ కార్డు దోహదపడుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలోని 22వ వార్డులో పైలెట్ ప్రాజెక్టుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే తీరును శనివారం ఆమె పరిశీలించి వివరాల అడిగి తెలుసుకున్నారు.

    అనంతరం స్థానిక అంగన్వాడీ సెంటర్ ను సందర్శించి చిన్నారులకు అందిస్తున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, ఎంపీడీఓ చిన్న నాగేశ్వరరావు, తహసీల్దార్ యోగేశ్వరరావు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మున్సిపల్, రెవెన్యూ, సిబ్బంది, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News