బీఆర్ఎస్ కి షాక్.. కాంగ్రెస్ లో చేరిన సర్పంచులు, ఎంపీటీసీ, సొసైటీ డైరెక్టర్..
దమ్మపేట బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.
దిశ, దమ్మపేట : దమ్మపేట బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. దమ్మపేట మండలానికి చెందిన నాచారం సర్పంచ్ వేపకుంట్ల వెంకమ్మ, నాగుపల్లి సర్పంచ్ ఇస్లావత్ నాగమణి, సీతారాంపురం సర్పంచ్ వెంకటేశ్వరరావు, నాచారం ఎంపీటీసీ గోడపాటి వెంకట్రావు సొసైటీ డైరెక్టర్ ఏల్లిన రాఘవరావుతో పాటు మరొక 40 మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం ఖమ్మం పట్టణంలోని తుమ్మల క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. 40 ఏళ్ళు తనతో ప్రయాణించిన వారంతా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రాష్ట్ర ఆయిల్ ఫామ్ అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, మద్దిశెట్టి సత్యప్రసాద్, రావు గంగాధరరావు, కోటగిరి సత్యంబాబు, మారుబోయిన హరిబాబు, కాసాని నాగప్రసాద్, ఎర్రగొర్ల రాదయ్య, కె.వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.