పనులను త్వరితగతిన పూర్తి చేయాలి..ద్విచక్ర వాహనంపై పర్యటించిన మంత్రి తుమ్మల
ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో సమస్యలను
దిశ,ఖమ్మం : ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో సమస్యలను తెలుసుకుంటూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై పర్యటించారు. ద్విచక్రవాహనంపై మున్సిపల్ కమిషనర్ తో కలిసి త్రీ టౌన్ లో పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. అక్కడ పలు సమస్యలు తెలుసుకుని తగు సూచనలు జారీ చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఖమ్మం మార్కెట్ ఏరియా, ప్రకాష్ నగర్ లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ధంసలాపురం ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వెళ్లి ఎగ్జిట్ పనులను పరిశీలించి త్రీ టౌన్ ప్రాంతానికి కలిపే రోడ్డుని డబుల్ రోడ్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య నగర మేయర్ పూనుకొల్లు నీరజ ,సాధు రమేష్ రెడ్డి , కమర్తపు మురళి, కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.