MLA Maloth Ramdas Naik : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు.

Update: 2024-11-11 16:52 GMT

దిశ, వైరా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం వైరా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు,. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని అన్నారు.

పండించిన పంటను దళారులకు అమ్ముకోకుండా ధాన్య కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలని కోరారు సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ కల్పిస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు రైతు భరోసా రైతు రుణమాఫీ చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, నాయకులు దాసరి దానియేలు, మిట్టపల్లి నాగి, పొదిల్ల హరినాథ్, దార్న రాజశేఖర్,డీసీఎంఎస్ , సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు


Similar News