నిర్దేశిత గడువు లోగా ప్రకాష్ నగర్ బ్రిడ్జి పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల

దసరా పండుగ నుంచి ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర పాత లో లెవల్ క్యాజ్ వే

Update: 2024-10-10 12:31 GMT

దిశ, ఖమ్మం : దసరా పండుగ నుంచి ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర పాత లో లెవల్ క్యాజ్ వే డైవర్షన్ రోడ్డు పనులు పూర్తి చేసి, రాకపోకలు ప్రారంభించాలని, ఆ దిశగా పనులను అక్టోబర్ 11 సాయంత్రం లోగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గురువారం మంత్రి, ఖమ్మం పట్టణంలోని 28వ డివిజన్ ప్రకాష్ నగర్ లో పర్యటించి టీయుఎఫ్ ఐడీసి నిధులు రూ. ఒక కోటి 90 లక్షలతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులు త్వరగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం మంత్రి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జిని యధాస్థితికి తీసుకొని వచ్చేందుకు అప్పగించిన నిర్దేశిత గడువు 100 రోజుల లోగా పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని అన్నారు. ప్రజలకు రాకపోకలకు ఇబ్బందుల పరిష్కారం దృష్ట్యా ప్రకాష్ నగర్ వద్ద ఉన్న పాత లో లెవల్ క్యాజ్ వే డైవర్షన్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలన్నారు. పనులు అక్టోబర్ 11 లోగా పూర్తి చేసి, పండుగ రోజు నుండి వాహనాల రాకపోకలు జరిగేలా చూడాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ లు, ఆర్ అండ్ బి డీఇ చంద్రశేఖర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News