సీతారామ ప్రధాన కాలువకు భారీ గండి

గోదావరి పై నిర్మించిన సీతారామా ప్రాజెక్టు ప్రధాన కాలువకు భారీ గండి పడింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వాగులు స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

Update: 2024-09-01 05:00 GMT

దిశ, ములకలపల్లి: గోదావరి పై నిర్మించిన సీతారామా ప్రాజెక్టు ప్రధాన కాలువకు భారీ గండి పడింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వాగులు స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇందులో భాగంగా ములకలపల్లి మండలం వీకే రామవరం పంప్ హౌస్ 2 సమీపంలో ఈ గండి పడి నీరు బయటకు ప్రవహిస్తుంది. దీంతో కాలువ కింద ఉన్న పంట భూములు నీటి ప్రవాహానికి గురై కొట్టుకుపోయాయి. ప్రధాన కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యతను ఈ ఘటన ప్రశ్నించేలా ఉందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడే సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారు. దీంతో సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువకు పడిన గండి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.


Similar News