Rega Kantha Rao : తెలంగాణలో కక్షపూరితమైన పరిపాలన సాగుతుంది..

భద్రాచలం పట్టణంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ( Rega Kantha Rao ) పాత్రికేయులతో మాట్లాడారు

Update: 2024-10-28 09:43 GMT

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం పట్టణంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ( Rega Kantha Rao ) పాత్రికేయులతో మాట్లాడారు. తెలంగాణలో కక్షపూరితమైన వాతావరణం కొనసాగుతుందని, రాష్ట్రంలో ప్రజా పాలన గాలికి వదిలేసి విదేశీ టూర్ ద్వారా ప్రజల సొమ్మును కాంగ్రెస్ నాయకులు ఆగం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కచ్చితంగా తెలంగాణలో 100% ఉప ఎన్నిక వస్తుందని ప్రజలు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అమలు కాని హామీలతో, ఆరు గ్యారెంటీలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాలం వెలదీస్తుంది తప్ప హామీలు అమలు కావడం లేదని అన్నారు.

రాష్ట్రంలో ఏ వర్గం అయినా ప్రశాంతంగా ఉందా అని ప్రశ్నించారు. విద్యార్థులకు, ఉద్యోగస్తులు, ఆఖరికి పోలీసులు కూడా రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారంటే ప్రజా పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ నాయకులు మానే రామకృష్ణ, చర్ల మండల పార్టీ అధ్యక్షులు సోయం రాజారావు, సీనియర్ నాయకులు శ్రీనివాసరాజు, ఆకోజు సునీల్ కుమార్, కణితిరాముడు, కోలరాజు, రేసు లక్ష్మి, రామ్ రెడ్డి, గుంజ ఏడుకొండలు, కాపుల సూరిబాబు, భక్తుల నరసింహులు, అయినాల రామకృష్ణ, అంబటికర్ర కృష్ణ, చిట్టి మల్ల అనిల్ కుమార్, కొలిపాక శివ, రాఘవ, ప్రకాష్, పూజల లక్ష్మి, సీతామహాలక్ష్మి, ప్రియాంక, నాగరాజు, రాణి, కీసర యువరాజు, గుంజ బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News