ప్రీతికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని ప్రీతికి న్యాయం చేయాలని నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
దిశ, దుండిగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని ప్రీతికి న్యాయం చేయాలని నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో షీ టీమ్స్ పేరుకు మాత్రమే ఉన్నాయని విద్యార్థినులు, మహిళల పట్ల సర్కారు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని ప్రీతికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏబీవీపీ కన్వీనర్ నగేష్, కూకట్ పల్లి కన్వీనర్ ప్రతీక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవన్, సిటీ వర్కింగ్ కమిటీ మెంబర్స్, సిటీ విద్యార్థి నాయకులు రాఘవేంద్ర, జమీల్, ఆయుష్, కిషోర్ తరుణ్, హితేష్ మున్నా, తదితరులు పాల్గొన్నారు.