స్వాతి హత్య కేసులో విస్తూపోయే నిజాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని మాచన్నపేట తండాలో హత్యకు గురైన స్వాతి కేసులో విస్తూపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.
దిశ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని మాచన్నపేట తండాలో హత్యకు గురైన స్వాతి కేసులో విస్తూపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు భానోత్ వీరభద్రంకు స్వాతితో కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. వీరభద్రంకు ఇంతకుముందే నందిని అనే మహిళతో వివాహమైంది.
ఈ క్రమంలో గత మూడు రోజుల క్రితం స్వాతిని హత్య చేసి తన పొలంలో పూడ్చిపెట్టాడు. గ్రామస్తుల ద్వారా విషయం బయటకు పొక్కడంతో నిందితుడు వీరభద్రాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, రాణా ప్రతాప్ సందర్శించి పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీయించారు.