మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ : డీజీపీ మహేందర్ రెడ్డి

మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ నిలవడంలో ప్రజల సహకారం అభినందనీయమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.

Update: 2022-12-15 11:37 GMT

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ నిలవడంలో ప్రజల సహకారం అభినందనీయమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్​ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా కొనసాగించేందుకు ఇక్కడి పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల పనితీరును కొనియాడారు. జిల్లా పోలీసులు ఉన్నతాధికారుల సహకారాలతో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మావోయిస్టులు జిల్లాలో అడుగు పెట్టకుండా నిరంతర నిఘా భద్రతలతో చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలనే లక్ష సాధన తో రెండు జిల్లాల పోలీస్ యంత్రాంగం అద్భుతంగా పనిచేస్తున్నాయని ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో కూడా ములుగు, భద్రాద్రి జిల్లాల పోలీసులు మావోయిస్టుల ద్వారా ఏర్పడే సమస్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మావోయిస్టులను ఆమడ దూరంలో పెడుతూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా ప్రజలు బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరిస్తున్న తీరును కొనియాడారు. ముఖ్యంగా మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సమిష్టిగా చేస్తున్న కృషిని డీజీపీ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థకు పెద్దపీట వేస్తూ నేర కట్టడికి అధునాతన సాంకేతికతను అందజేస్తూ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతిభద్రతలు ఎక్కడైతే పటిష్టంగా ఉంటాయో ఆ రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. అదే దిశగా తెలంగాణ రాష్ట్రం ప్రయనిస్తుందని తెలిపారు. ముందుగా చత్తీస్​ఘడ్ సరిహద్దు ప్రాంతమైన ఆలుబాక బేస్ క్యాంపును సందర్శించి కొత్తగూడెం చేరుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ జి, భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు, ఓఎస్డీ సాయి మనోహర్, డీఎస్పీ వెంకటేశ్వర బాబు, జిల్లా పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు.

Also Read...

'తొండి ప్రభుత్వం పోవాలి.. బండి ప్రభుత్వం రావాలి'

Tags:    

Similar News