దిశ ఎఫెక్ట్.. అంగన్వాడీ సెంటర్లో కుళ్లిన కోడిగుడ్ల పై తహశీల్దార్ ఆరా..

కొరవడిన అధికారుల పర్యవేక్షణతో నాణ్యత లోపించిన పౌష్టిక ఆహారమే అంగన్వాడి సెంటర్లో అందిస్తున్నారని, ఈ సమస్య పై దిశ పత్రికలో అంగన్వాడి సెంటర్లో కుళ్లిన కోడిగుడ్లు అనే కథనం, గురువారం ప్రచురితం అయింది.

Update: 2024-11-14 08:24 GMT

దిశ, తిరుమలాయపాలెం : కొరవడిన అధికారుల పర్యవేక్షణతో నాణ్యత లోపించిన పౌష్టిక ఆహారమే అంగన్వాడి సెంటర్లో అందిస్తున్నారని, ఈ సమస్య పై దిశ పత్రికలో అంగన్వాడి సెంటర్లో కుళ్లిన కోడిగుడ్లు అనే కథనం, గురువారం ప్రచురితం ఐయింది. దిశ కథనం ద్వారా సమస్య తెలుసుకున్న మండల తహశీల్దార్ రామకృష్ణ, గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు, అంగన్వాడి సెంటర్లో అందిస్తున్న పౌష్టికాహారం పై ఆరా తీశారు. అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసి, వెంటనే తనకు రిపోర్ట్ అందించాలని సీడీపీఓ ఉదయ్ శ్రీ కి చారవాణి ద్వారా ఆదేశాలు ఇచ్చారు.

Tags:    

Similar News