ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు.. నీటమునిగిన శ్రీరామ్నగర్ కాలనీ

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడ చూసిన వరద నీరే కనిపిస్తుంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గాను మున్నేరుకు వరద నీరు పోటెత్తుతోంది.

Update: 2024-09-01 03:59 GMT

దిశ, ఖమ్మం రూరల్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడ చూసిన వరద నీరే కనిపిస్తుంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గాను మున్నేరుకు వరద నీరు పోటెత్తుతోంది. మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏదులాపురం చెరువు అలుగు పోస్తుండటంతో దిగువన ఉన్న శ్రీరామ్నగర్ కాలనీ అంతా నీటమునిగింది. కాలనీలోని ఇళ్లల్లోకి సుమారు ఆరు అడుగులకు పైగా నీరు వచ్చి చేరుతోంది. ప్రజలు భయాందోళన మధ్య జీవిస్తున్నారు. వారిని సైతం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. అకేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అకేరు వంతెన మునిగి రాకపోకలు నిలిచాయి. తీర్థాల ఆలయ ఆవరణం వరదనీటితో కమ్మేసింది.

పాలేరు నియోజకవర్గంలోని పాలేరు చెరువు అలుగు వస్తుండటంతో దిగువన ఉన్న పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. పాలేరు అలుగు పోస్తుండటంతో ఖమ్మం‌‌–సూర్యాపేట ప్రధాన రాహాదారి పై రాకపోకలు నిలిచాయి. అదే విధంగా రాజుపేటకు సైతం రాకపోకలు నిలిచాయి. నియోజకవర్గంలోని పలు చెరువులు అన్ని అలుగు వస్తుండటంతో పలు గ్రామాలు నీట మునిగాయి. చెరువు కట్టలు సైతం తెగే ప్రమాదం సైతం లేకపోలేదు. ఇదే విధంగా వర్షం పడితే రూరల్ మండలంలోని మున్నేరు పరిహహాకం అంతా నీట మునిగింది.


Similar News