చెలరేగిన మట్టి మాఫియా...

సత్తుపల్లి మండల పరిధిలోని కొమ్మేపల్లి, లింగపాలెం, కిష్టారం, రెవెన్యూ సరిహద్దు ప్రాంతం నుంచి... Soil Mafia

Update: 2023-03-03 08:24 GMT

దిశ, ఖమ్మం: సత్తుపల్లి మండల పరిధిలోని కొమ్మేపల్లి, లింగపాలెం, కిష్టారం, రెవెన్యూ సరిహద్దు ప్రాంతం నుంచి వందలాది ట్రిప్పులు అక్రమంగా మట్టి తరలిస్తున్నా రెవెన్యూ, స్థానిక పోలీస్ శాఖ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేకపోవటం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సింగరేణి పరిధిలోని ప్రాంతమైన కొమ్మేపల్లి, లింగపాలెం, సింగరేణి సంస్థ నుంచి నష్టపరిహారం పొందిన కొమ్మేపల్లి, లింగపాలెం రెవెన్యూ పరిధిలో వ్యవసాయ వ్యవసాయ భూమిని రైతుల వద్ద నుంచి సింగరేణి సేకరించినప్పటికీ, కొంతమంది రైతులకు సింగరేణి పరిహారం అందజేసి మరికొంతమంది రైతులకు జాప్యం చేయటంతో ఆ రెవెన్యూ పరిధిలోని స్థానిక రైతులకు, మట్టి మాఫియా, డబ్బులను ఆశగా చూపి, ఎలాగో సింగరేణి పరిహారం మీకు అందుతుంది కదా, దానికి తోడు నీకు ఎంతోకొంత డబ్బు మూట్ట చెబుతామని ఆశ చూపి మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానిక రైతులు వాపోతున్నారు.

ఆ రెవెన్యూ పరిధిలోని ప్రత్యేకమైన రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకుని రాత్రి పగలు తేడా లేకుండా వందలాది ట్రిప్పుల మట్టి తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వారి అసమర్థతను స్థానిక ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. మట్టి తరలింపుపై దిశ దినపత్రిక పలు సంచలన కథనాలు ప్రచురించిన తర్వాత రెండు మూడు రోజులు నిలుపుదల చేసి మరల యథావిథిగా వందలాది ట్రిప్పుల మట్టి తరలించేందుకు మట్టి మాఫియా సిద్ధమయ్యారని చెప్పవచ్చు. రెవెన్యూ పోలీస్ అధికారుల అండదండలతోపాటు స్థానిక ప్రముఖ రాజకీయ నాయకులను పేర్లు వాడుకుని స్థానిక అధికారులను మధ్యలో పెడుతున్నట్లు తమకు ఆ నాయకుడు తెలుసు ఈ నాయకుడు తెలుసు.. తామ దగ్గరి బంధువులు తాము ఫలానా నాయకులకు చాలా దగ్గర బంధువులము అని అధికారులను మభ్యపెడుతున్నట్లు, అధికారులు పలుమార్లు ఉచ్చరించటం శోషనీయం.

మట్టి మాఫియాకు వెనుక ఉండి ఈ తతంగాన్నంతా నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కోమ్మేపల్లి పరిధి నుంచి సింగరేణి జీఎం కార్యాలయం మీదుగా సత్తుపల్లి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు నుంచి పదుల సంఖ్యలో టిప్పర్లు మట్టి తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు కంటికి కనపడకుండా లేదనటం విశేషం. రెవెన్యూ పోలీస్ అధికారుల అండదండలతోనే మట్టి మాఫియా వేల సంఖ్యల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నట్లు, బేతుపల్లి, తాళ్లమడ రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ భూమిగా మార్చేందుకు వందలాది లారీలతో వేలాది ట్రిప్పులు మట్టి తరలిస్తున్నా అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. పదుల సంఖ్యలో టిప్పర్లను సత్తుపల్లిలో అధిక స్పీడ్ తో తోలుతూ గతంలో రెండు మూడు పర్యాయములు సత్తుపల్లి పట్టణంలో ప్రమాదాలకు కారణమైన కానీ అధికారులు వీరి తీరుని పట్టించుకోవటంలేదని స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి మాఫియా మట్టిని తరలించే టిప్పర్లకు సరైన పత్రాలతోపాటు డ్రైవర్లకు లైసెన్స్ లేదని ఆంధ్ర పర్మిట్ తో తెలంగాణలో నడుపుతున్నట్లు స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. కొమ్మేపల్లి, లింగపాలెం, రెవెన్యూ పరిధిలోని వ్యవసాయం చేసుకునే రైతులు మట్టి మాఫియా బారి నుండి తమను, తమ పంట పొలాలను కాపాడాలని వేడుకుంటున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీస్, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారులు స్పందించి వారిపై కఠినమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలతోపాటు వివిధ గ్రామాల రెవెన్యూ పరిధిలోని రైతులు కోరుతున్నారు.

Tags:    

Similar News