రూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

ఒడిస్సా నుండి హైదరాబాద్, ముంబై పట్టణాలకు అక్రమంగా తరలిస్తున్న 300 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.

Update: 2024-09-23 15:39 GMT

దిశ, భద్రాచలం :  ఒడిస్సా నుండి హైదరాబాద్, ముంబై పట్టణాలకు అక్రమంగా తరలిస్తున్న 300 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. భద్రాచలం పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో గంజాయిని గుర్తించి, కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు తెలిసింది. అలాగే గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో బూర్గంపాడు వద్ద మరొక వాహనంలో తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ రెండు సంఘటనలలో సుమారు 300 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకోగా, దాని విలువ సుమారు రెండు కోట్ల రూపాయల విలువ ఉంటుంది. కాగా ఇంత భారీ మొత్తంలో గంజాయిని తరలించడం వెనక ఇంకా చాలామంది ప్రమేయం ఉందని అధికారుల విచారణలో తేలడంతో వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు భద్రాచలం కేంద్రంగా ఉండి అసలైన నిందితులను వేటాడే పనిలో ఉన్నారు. గంజాయి పట్టుకున్న విషయం పై అసిస్టెంట్ కమిషనర్ గణేష్ ను వివరణ కోరగా... ఇంకా నలుగురు నిందితులు పట్టుబడాల్సి ఉందని, మంగళవారం ఉదయం పూర్తి సమాచారం తెలియజేస్తామని తెలిపారు.


Similar News