బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు..

అధికార బీఆర్ఎస్ పార్టీకి బీగ్ షాక్ తగిలింది. మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామ పంచాయతీ సర్పంచ్లు కూరసం రాంబాబు, పడిగల వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం ప్రకటించారు.

Update: 2023-11-13 16:54 GMT

దిశ, మణుగూరు : అధికార బీఆర్ఎస్ పార్టీకి బీగ్ షాక్ తగిలింది. మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామ పంచాయతీ సర్పంచ్లు కూరసం రాంబాబు, పడిగల వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము సర్పంచ్‌లు గా ఎన్నికైనప్పటి నుండి గ్రామంలో పంచాయతీ నిధులు తప్ప,మరి ఏనిధులు మంజూరు కాలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచ్‌లకు గుర్తింపు లేదని వాపోయారు. ఈనేపద్యంలోనే పార్టీని వీడి వెళుతున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ అభ్యర్ధి పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 50 కుటుంబాలతో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామని తెలిపారు.అలాగే మారాజీనామాలు మండల అధ్యక్షుడు స్వీకరించాలని వారు కోరారు.

Tags:    

Similar News