కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిన ఉదంతమిది. 9వ తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మండలంలోని సంపత్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2025-03-19 15:24 GMT
కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
  • whatsapp icon

దిశ,టేకులపల్లి : విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిన ఉదంతమిది. 9వ తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మండలంలోని సంపత్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు రోజులగా ఎనిమిదో తరగతి బాలికపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులకు తెలపగా వారు, గ్రామస్తులు కలిసి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఉపాధ్యాయుడు డిప్యూటేషన్‌పై వచ్చి అభం శుభం తెలని అమాయకమైన బాలికపై కన్నేసాడని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండడం పై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి మాత్రం రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు బోడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు బోడు ఎస్ఐ పి శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News