పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా : వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తానని ఇదే పాలేరు మట్టి సాక్షిగా మాట ఇచ్చానని తప్పుకుండా జరుగుతుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
దిశ, ఖమ్మం రూరల్ : వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తానని ఇదే పాలేరు మట్టి సాక్షిగా మాట ఇచ్చానని తప్పుకుండా జరుగుతుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని శనివారం రూరల్ మండలం పొలేపల్లి పరిధిలో వైఎస్ఆర్టీపీ క్యాంపు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆమె అవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ పాలన పాలేరు గడ్డమీద ప్రతి ఒక్కరికీ అందిస్తా అని అన్నారు. వైఎస్సార్ పాలన ప్రతి గడపకు చేరుస్తానన్నారు. ఈ పాలేరు గడ్డకు నమ్మకంగా సేవ చేయడమే తన లక్ష్యం అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర మళ్లీ కొనసాగుతుందన్నారు.
ఈ పాలేరు నియోజక వర్గంలోనే పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 4వేల కిలోమీటర్ల ప్రస్థానం ఇక్కడే పాలేరు గడ్డ మీదనే పూర్తి చేస్తా అన్నారు. పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా అన్నారు. మీ వైఎస్సార్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, ప్రతి వర్గాన్ని గుండెల్లో పెట్టుకున్న మహనీయుడు వైఎస్సార్ అని అన్నారు. మంచి నాయకుడు కాబట్టే మహా నాయకుడు అయ్యాడని, ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ అని అన్నారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలు ఈ దేశానికే ఆదర్శం అని పేర్కొన్నారు. రైతులకు విలువ తెచ్చింది వైఎస్ఆరే అన్నారు. లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చింది వైఎస్ఆర్ అని గుర్తు చేశారు.
పాలేరులో వైఎస్ షర్మిలను గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని నియోజకవర్గ నాయకుడు రామసహాయం నరేష్‌రెడ్డి అన్నారు. అనంతరం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అభిమానుల మధ్య వైఎస్ షర్మిల కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర నాయకులు పిట్ట శ్రీనివాసరెడ్డి, రామసహాయం నరేష్‌రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు నంద్యాల రవీందర్‌రెడ్డి, గడిపల్లి కవిత, దరంసోతు రాము పాల్గొన్నారు.
Read More..
వైఎస్ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్.. షర్మిల ఇంట్రెస్టింగ్ రిప్లై