సీఎం‌ఆర్ అక్రమాలపై విచారణకు ఆదేశం

ఖమ్మం జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీ‌ఎం‌ఆర్) అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

Update: 2024-10-01 15:16 GMT

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీ‌ఎం‌ఆర్) అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం రైస్ మిల్లర్లకు అప్పగిస్తే ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా ఎగవేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఏఏ సంవత్సరం నుంచి ఎంత మంది రైస్ మిల్లర్ల నుంచి ఎంత సీ‌ఎం‌ఆర్ రావాల్సి ఉందని కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ మొత్తం అక్రమాలపై మిల్లర్లు, అధికారుల పాత్రపై విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. 

Tags:    

Similar News