ఎంత చేసినా తక్కువే

ఖమ్మం మున్నేరు వరద బాధితులకు ఎంత సహాయం చేసినా అది తక్కువే అవుతుందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

Update: 2024-09-12 13:41 GMT

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం మున్నేరు వరద బాధితులకు ఎంత సహాయం చేసినా అది తక్కువే అవుతుందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గురువారం ఖమ్మం నగరంలోని నయాబజార్ కళాశాల ఆవరణలో మున్నేరు వరద బాధితుల కోసం హైదరాబాద్​లో నివసించే ఖమ్మం మిత్రులు, మదార్ సాబ్ చారిటబుల్ ట్రస్ట్ ల ఆధ్వర్యంలో వరద బాధితులకు ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బొక్కల గడ్డ, రాజీవ్ గృహకల్ప తదితర ప్రాంతాలలో పర్యటించి బాధితుల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

    అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పులకు తగిన విధంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మున్నేరు వాగు వరద బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారని, వారికి తక్షణ సహాయంతో పాటు మనోధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇంకా సహాయ సహకారాలు అందించే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని బాధితులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ గోపగాని శంకర్రావు, జిల్లా కన్వీనర్ బాబు, టీఎన్జీవో మాజీ అధ్యక్షులు రంగరాజు, ప్రధాన కార్యదర్శులు అంబటి శ్రీనివాస్, బైరి రమేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎం. నరసయ్య, ఖమ్మం మిత్రులు సీహెచ్. వీరారెడ్డి , జైపాల్ రెడ్డి, కె.వెంకటేశ్వర్లు, సురేష్, కృష్ణవేణి పాల్గొన్నారు.

Tags:    

Similar News