నిగ్గదీసి వార్తలు ప్రచురించడంలో ‘దిశ’నే దిట్ట : పినపాక ఎమ్మెల్యే
నేటి సమాజంలో జరుగుతున్న అవినీతిని నిగ్గదీసి వార్తలు
దిశ,మణుగూరు : నేటి సమాజంలో జరుగుతున్న అవినీతిని నిగ్గదీసి వార్తలు ప్రచురించడంలో దిశనే మొట్ట మొదటి పత్రికని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మణుగూరు మండలంలోని ప్రజా భవన్ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పీరనాకి నవీన్ ఆధ్వర్యంలో "2025 నూతన సంవత్సర" దిశ దినపత్రిక క్యాలెండర్ ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘనంగా ఆవిష్కరించారు.ముందుగా నియోజకవర్గ ఇంచార్జ్ కర్లపూడి సతీష్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు శాలువా కప్పి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి పూలబుక్కెను అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ ఎవరికీ భయపడకుండా నిజాలు నిర్భయంగా రాసే పత్రిక ఒక్క దిశ పత్రికని తెలిపారు.వార్తలు నిగ్గదీసి రాయడంలో దిశనే ముందుటుందన్నారు.ప్రజలకు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ లు అందించడంలో దిశనే నెం:1 స్థానంలో ఉంటుందని కొనియాడారు.నిత్యం సంచలన న్యూస్ లు..డైనమిక్ ఎడిషన్ కధనాలు ప్రచురించడంలో దిశకు సాటి లేనన్నారు.రోజులో 3 సార్లు డైనమిక్ ఎడిషన్లు అందించే ఏకైక పత్రిక దిశ అన్నారు.
Wi-Fi నెట్ ఎంత వేగంగా ఉంటుందో అంతే వేగంగా దిశ నేటి సమాజం లో దూసుకుపోతుందని కీర్తించారు.పత్రికలల్లో దిశ ఒక డిఫ్ఫరెంట్ పత్రికని అభివర్ణించారు.రోజు ఉదయం దిశ పత్రికతో పాటు,డైనమిక్ ఎడిషన్స్ కూడా ఎక్కువగా చూస్తానని ఆయన పేర్కొన్నారు. గూగుల్,వాట్సాప్,ఫేస్ బుక్,టెలిగ్రామ్,ఇంస్టాగ్రామ్ తదితర వాటితో దిశ సమానంగా పోటీ పడుతుందని తెలిపారు. మునుముందు దిశ మంచిమంచి కధనాలు ప్రచురించి ప్రజలకు చేరవేయాలని ఆయన ఆకాంక్షించారు.దిశ పత్రిక యాజమాన్యంకు,జిల్లాల బ్యూరోలకు,మండలాల రిపోర్టర్లకు "2025-నూతన సంవత్సర"శుభాకాంక్షలు తెలియజేశారు.దిశ క్యాలెండర్ ఆవిష్కరణలో మండల నాయకులు గాండ్ల సురేష్, పాతురి వెంకన్న,కూచిపూడి బాబు,పాల్వంచ రాములు, వెంకట్ రావు,తమ్మిశెట్టి సాంబ, బల్లెం సురేష్,మహిళ నాయకురాలు సౌజన్య,వరలక్ష్మి, కార్యకర్తలు,అభిమానులు,పత్రిక రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.