Championship : కరాటేలో న్యూ లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థుల ఓవరాల్ ఛాంపియన్ షిప్..
వరంగల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 9వ జాతీయ షోటోఖాన్ కరాటే ఛాంపియన్ షిప్ -2024 పోటీల్లో న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు వివిధ కేటగిరిల్లో పాల్గొని ఓవరాల్ కరాటే ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుని తమ సత్తా చాటారు.
దిశ, వైరా : వరంగల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 9వ జాతీయ షోటోఖాన్ కరాటే ఛాంపియన్ షిప్ -2024 పోటీల్లో న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు వివిధ కేటగిరిల్లో పాల్గొని ఓవరాల్ కరాటే ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుని తమ సత్తా చాటారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎన్.కృష్ణ విశ్వశ్రీ , ఎ.అమృతవర్షిని, కె.జేసుసఅలైష, ఎస్.కె.ఆర్శియా తబసుం, ఎస్.కె. షిరీన్, ఎన్.దినేష్ సాత్విక్, ఎస్.గణేష్, ఎస్.కె.మేహఫూజ్, బి.రేవంత్, కె.రాజేష్, టి.గౌతమ్, ఎమ్.డియోన్ ఆల్ఫోన్సె మాథ్యూ కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. కె.చందన, ఎ.అమృత వర్షిని, బి.మహేశ్వరీ, కె.జేసుసఅలైష, ఎస్.కె.షిరీన్, ఎస్.కె.మేహఫూజ్, బి.రేవంత్, బి.లోకేష్, టి.గౌతమ్, పి.కినిత్, బి.భానుప్రసాద్, ఎమ్.డియోన్ ఆల్ఫోన్సె మాథ్యూ సిల్వర్ మెడల్ ను సొంతం చేసుకున్నారు. కె.చందన, ఎన్.కృష్ణ విశ్వశ్రీ, బి.మహేశ్వరీ, ఎస్.కె.ఆర్శియా తబసు౦, ఎన్.దినేష్ సాత్విక్, బి.లోకేష్, కె.రాజేష్, పి.కినిత్ లు బ్రౌన్జ్ మెడల్స్ ను సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు, డైరెక్టర్ కుర్రా సుమన్ మాట్లాడుతూ కరాటే అనేది ఒక యుద్ధకళని చెప్పారు. అలాంటి యుద్ధ కళను పాఠశాలలో ప్రవేశపెట్టి కరాటే కోచ్ సహాయంతో విద్యార్థులు ఎంతో క్రమశిక్షణగా ఓర్పుతో సాహసోపేతమైన కరాటేను నేర్చుకోవటమే కాకుండా జాతీయ స్థాయి పోటిల్లో పాల్గొని వివిధ పథకాలను సాధించడం అభినందనీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికలు తమను తాము అత్యవసర పరిస్థితుల్లో కాపాడుకునేందుకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. కరాటే పోటీల్లో జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ పాఠశాల ప్రిన్సిపాల్ షాజీమాథ్యూ, ఎఓ.సామినేని నరసింహరావు, కరాటే మాష్టారు మెహబూబ్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.