దిశ ఎఫెక్ట్.. వరస కథనాలతో మున్సిపాలిటీ జేఏవో బదిలీ..

మణుగూరు మున్సిపాలిటీలో పని చేస్తున్న జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ అవినీతి ఆరోపణలు ఎదురుకొంటున్నందుకు, ట్రాస్ఫర్ ఆర్డర్ వచ్చిన కదలనందుకు దిశ వరుస కథనాలకు స్పందించిన లభించింది.

Update: 2025-03-24 03:38 GMT
దిశ ఎఫెక్ట్.. వరస కథనాలతో మున్సిపాలిటీ జేఏవో బదిలీ..
  • whatsapp icon

దిశ, మణుగూరు : మణుగూరు మున్సిపాలిటీలో పని చేస్తున్న జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ అవినీతి ఆరోపణలు ఎదురుకొంటున్నందుకు, ట్రాస్ఫర్ ఆర్డర్ వచ్చిన కదలనందుకు దిశ వరుస కథనాలకు స్పందించిన లభించింది. మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ ప్రసాద్ దిశ కథనాలకు స్పందించి అన్నింటి పై ఆరాలు తీసి జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కి రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చి రామగుండం మున్సిపాలిటీకి పంపించేశారు. అయితే కార్యాలయంలో అకౌంటెంట్ ఆఫీసర్ కదలడంతో కార్యాలయంలో ఉన్న మరో ఇద్దరు అధికారులు సీనియర్ అసిస్టెంట్ ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్లకు భయం పట్టుకున్నట్లు వినపడుతోంది.

తాము ఇదే మున్సిపాలిటీ ఆఫీస్ లో 10 సంవత్సరాలు పని చేసిన మాట వాస్తవమేనని పలువురికి చెప్పుకుంటూ, తాము చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతోందని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని కూడా వినపడుతోంది. అంతే గాక వారు ట్రాన్స్ఫర్ కాకుండా ఉండటానికి ఇదే మున్సిపాలిటీ కార్యాలయంలో తిష్ట వేయడం కోసం పై అధికారులతో లక్షల రూపాయలతో భారీగా ఫైరవీలు..? చేస్తున్నారని కూడా వినపడుతోంది. ఏ అధికారికి ముడుపులు ఇవ్వాలో తమకి తెలుసని చెప్పుకుంటూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని కొందరితో చెప్పుకుంటూ తిరుగుతున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. ఇప్పటికైనా రివిజినల్ డైరెక్టర్ అధికారి వీరిపై విజిలెన్స్ ఎంక్వరి చేపించి, వీరి సెక్షన్స్ రికార్డ్స్, తదితర లావాదేవీలు పరిశీలించాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.


Similar News