Minister:నెలాఖరు కల్లా 4.5 లక్షల ఇండ్లు ప్రారంభిస్తాం

Update: 2024-08-08 15:07 GMT

దిశ,సత్తుపల్లి: ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఈ నెలాఖరు కల్లా ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే చెప్పినట్టుగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రాష్ట్రంలో ధరణితో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. సీతారామ రీ డిజైన్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ గొప్పలకు పోయి పేదోడి సొమ్మును దుర్వినియోగం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీలైనంత పొదుపు చేస్తూ సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.550 కోట్లు పాత పేమెంట్లు చేశామని నిద్రపోతున్న కాంట్రాక్టర్లను మేల్కొల్పి సీతారామ 1 లక్ష 75 వేల ఎకరాల ఆయకట్టును స్దికరించేందుకు 93 కోట్లు ఖర్చుపెట్టినట్టు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పదవి నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పు 7. లక్షల 19 వేల కోట్లు వుంది. ప్రతి నెల ఈనాటి తెలంగాణ ప్రభుత్వం 6 వేల కోట్లు వడ్డీనే చెల్లిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బందుల్లేకుండా చిత్తశుద్ధితో 31 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పారు.

నిబద్ధతతో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల నెరవేర్చేందుకు ప్రభుత్వం అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తోందని గ్రామీణ ప్రాంతాలలో తెల్ల రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇబ్బందులు ఉన్నాయన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. గత బిఆర్ఎస్ పాలనలో ఇళ్ల స్థలాల రెగ్యులరేషన్ చేసేందుకు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని రాబోయే మూడు నెలల లోపు నాణ్యమైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అప్రూవల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గత ప్రభుత్వం విస్మరించిన పంటల భీమా కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని రైతును రాజకీయాలనేదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, సీతారామ ప్రాజెక్టు అధికారులు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పొంగులేటి అభిమానులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News