దిశ, ఖమ్మం రూరల్ : మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌ను త్వరలో ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు తెలిపారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నేతృత్వంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ పనులు ప్రారంభించాలని రిక్వెస్ట్ చేశామని, అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి.. ఈ నెల 17 తర్వాత పనుల ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు చెప్పారు. సంబంధిత శాఖాధికారులకు సైతం ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ తాతా మధు, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మలీడు వెంకన్న తదితరులు ఉన్నారు.