భద్రాద్రి జిల్లాలో మావోయిస్టుల బ్యానర్ల కలకలం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల బ్యానర్లు కలకలం సృష్టిస్తున్నాయి. చర్ల మండలంలో మవోయిస్టులకు చెందిన పోస్టర్లు, కరపత్రాలు దర్శనమిచ్చాయి.
దిశ, వెబ్డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల బ్యానర్లు కలకలం సృష్టిస్తున్నాయి. చర్ల మండలంలో మవోయిస్టులకు చెందిన పోస్టర్లు, కరపత్రాలు దర్శనమిచ్చాయి. ఆ పోస్టర్లలో ఈ నెల 23న అమరవీరుల దినంగా పాటించాలని మవోయిస్టులు పిలుపునిచ్చారు. కాగా ఈ పోస్టర్లు, బ్యానర్లు తెలంగాణ కమిటీ భారత మావోయిస్టు పేరుతో వెలిసాయి. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు, నిఘా బృందాలు తక్షణ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తుంది.