ప్రాణం చాలా విలువైనది...మనం పుట్టింది బతకడానికి కానీ చావడానికి కాదు

ప్రాణం చాలా విలువైనదని , మనం పుట్టింది బతకడానికి కానీ చావడానికి కాదు అని , ఎంత పెద్ద సమస్యలు వచ్చినా ఎక్కడో ఒక చోట పరిష్కార మార్గం చూసుకొని బతికేందుకు ప్రయత్నం చేయలే తప్ప ఎవరూ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Update: 2024-07-07 09:07 GMT

దిశ, మధిర : ప్రాణం చాలా విలువైనదని , మనం పుట్టింది బతకడానికి కానీ చావడానికి కాదు అని , ఎంత పెద్ద సమస్యలు వచ్చినా ఎక్కడో ఒక చోట పరిష్కార మార్గం చూసుకొని బతికేందుకు ప్రయత్నం చేయలే తప్ప ఎవరూ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన బోజడ్ల ప్రభాకర్ అనే రైతు తన వ్యవసాయ భూమిని వేరే వ్యక్తులు ఆక్రమించుకుని ధ్వంసం చేశారని స్థానిక తహసీల్దార్ సబ్ ఇన్స్పెక్టర్ కు తెలియజేసినా న్యాయం చేయలేదని ఇటీవల పురుగుమందు డబ్బా తో సెల్ఫీ వీడియో తీసుకుంటూ బలవన్మరణానికి పాల్పడిన సంఘటన విధితమే. దాంతో ఆదివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రొద్దుటూరు గ్రామానికి చేరుకొని

     కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా దురదృష్టకరమని, ప్రభాకర్ కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తామన్నారు. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు బాధాకరమని, తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని అన్నారు. ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడేందుకు దారి తీసేలా పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక్కడ ఉన్న

     వారంతా నా వారే జరిగిన పొరపాటుకు కారణం ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని అన్నారు. భూమికి సంబంధించిన శాశ్వత పరిష్కారం లభించేలా చేయాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. మృతుడి తండ్రి, భార్య పిల్లలతో మాట్లాడానని, అన్ని విధాలా కుటుంబాన్ని ఆదుకుంటానని తెలిపారు. పిల్లలు మంచిగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నానని, అందుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. మరి కొన్ని సమస్యలపై కుటుంబ సభ్యులు నాకు కొటేషన్ ఇచ్చారని, దాన్ని పూర్తిగా పరిశీలించి వారికి తగు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. 


Similar News