ఎస్సీ, ఎస్టీ కార్మికుల సమస్యల పరిష్కారానికే లైసెన్ సెల్

సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే ఎస్సీ, ఎస్టీ లైసెన్ సెల్ పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.

Update: 2024-11-12 15:16 GMT

దిశ, కొత్తగూడెం : సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే ఎస్సీ, ఎస్టీ లైసెన్ సెల్ పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఆయన ఎస్సీ, ఎస్టీ లైసెన్స్ సెల్ ని ప్రారంభించారు.

     ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సీఎండీ ఎన్.బలరాం చొరవతోనే ఈ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నామని ఆయన అన్నారు. కోరిన వెంటనే లైసెన్ సెల్ కార్యాలయానికి అనుమతులు ఇచ్చి ప్రత్యేక సెల్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Similar News