మహిళా జీఎంకు అవమానం

ఎస్సీ, ఎస్టీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ లైసెన్ సెల్ ను ప్రారంభించారు.

Update: 2024-11-12 14:09 GMT

దిశ, కొత్తగూడెం : ఎస్సీ, ఎస్టీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ లైసెన్ సెల్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం పలువురు వక్తలు ప్రసంగించారు. ఆ సమయంలో సింగరేణి జీఎం పర్సనల్ (ఐఆర్ & పీఆర్) కవితా నాయుడు అక్కడే ఉన్నారు. సమావేశంలో ఉన్న ఏకైక మహిళ అధికారిణి జీఎం కవితా నాయుడు సమావేశం జరిగినంత సేపు నిలబడే ఉన్నారు.

     సింగరేణిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్సనల్ (ఐఆర్ అండ్​ పీఎం ) విభాగానికి జీఎం అయిన మహిళను కనీసం కూర్చోమని కూడా ఎవరూ కోరకపోవడంతో సింగరేణి మహిళా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అధికారి అనే సంగతి అటు ఉంచితే, కనీసం సమావేశంలో ఉన్న ఏకైక మహిళ అనే గౌరవం కూడా ఇవ్వకపోవడం, అంత మంది పురుషుల మధ్య సమావేశం పూర్తయ్యే వరకు ఆమె నిల్చొనే ఉండటం అంటే మహిళలని అవమానించినట్టే అని పలువురు చర్చించుకుంటున్నారు. 


Similar News