MLA Koonanneni : చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజా సమస్యలకు పరిష్కారం..

అధికారులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు బాధ్యతతో సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ సేవలపట్ల ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.

Update: 2024-07-28 17:09 GMT

దిశ, కొత్తగూడెం రూరల్ : అధికారులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు బాధ్యతతో సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ సేవలపట్ల ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్బులో జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీచైర్ పర్సన్ కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు సమస్యలు పరిష్కరించేందుకు సమిష్టిగా కృషిచేయాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖా మున్సిపల్ గ్రామపంచాయతి శాఖల పారిశుద్ధ్య విభాగాలు అటవీశాఖలు కీలకమైనవని ఈ శాఖలు ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

సీతారామ ప్రాజెక్టు డిజైన్ మార్చడం ద్వారా జిల్లా రైతాంగానికి సాగునీటి అవసరాలు తీరతాయనే విషయాన్ని పలుమార్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసికెళ్ళానని ఈ విషయంలో వెనక్కుతగ్గేదిలేదన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే పరిస్థితులు ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని పోడు భూముల విషయంలో అటవీశాఖ సంయమనం పాటించాల్సి వుందన్నారు. మున్సిపల్ జీపీ శాఖలు పారిశుద్ధ్యం పై ప్రత్యేక ద్రుష్టి సారించాలని సూచించారు. అనంతరం పాలక మండలి సభ్యులు కూనంనేని శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, పలుశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News