Special buses : కార్తికమాసం స్పెషల్ ..పంచారామాలకు ప్రత్యేక బస్సులు

కార్తీకమాసం సందర్భంగా సత్తుపల్లి డిపో నుంచి అన్నవరం,పంచారామాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యు. రాజ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-10-31 12:16 GMT

దిశ,సత్తుపల్లి : కార్తీకమాసం సందర్భంగా సత్తుపల్లి డిపో నుంచి అన్నవరం,పంచారామాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యు. రాజ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నవరం కు నవంబర్ 3,10,14,17,24 తేదీలలో 64099 సర్వీస్ నెంబర్ తో డీలక్స్ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. అన్నవరం కు సత్తుపల్లి నుంచి చార్జీ 530 రూపాయలుగా నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం క్షేత్రాలకు నవంబర్ 3,10,17,24 తేదీలలో 64097 సర్వీస్ నంబర్తో డీలక్స్ బస్సులు ఏర్పాటు చేశామని, సత్తుపల్లి నుంచి చార్జీ 1500 రూపాయలు ఉంటుందన్నారు. అన్నవరం, పంచారామాల బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్స్ సౌకర్యం కల్పించినట్లు ఆమె తెలిపారు. 30-40 మంది భక్తులు ఉన్నట్లయితే వారు అడిగిన తేదీలలో పుణ్యక్షేత్రాలకు బస్సులు సమకూర్చుతామని అన్నారు . శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం అద్దె ప్రాతిపదికన సూపర్ లగ్జరీ బస్సులు ఇవ్వనున్నట్లు ఆమె వివరించారు. తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ, కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ పుణ్యక్షేత్రాల దర్శనానికి నవంబర్13 రాత్రి బస్సులు బయలుదేరి 16వ తేదీ ఉదయం సత్తుపల్లి కి చేరుకుంటాయని అన్నారు. సత్తుపల్లి డిపో పరిధిలోని భక్తులందరూ ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్తుపల్లి డిపో మేనేజర్ కోరారు. 


Similar News