కొత్తగూడెంలో కేఏ పాల్.. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం..

కొత్తగూడెంలో కేఏ పాల్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమీపంలో ధర్నా నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరంలో పాల్గొని ఆయన మాట్లాడారు.

Update: 2024-12-19 08:46 GMT

దిశ, కొత్తగూడెం : కొత్తగూడెంలో కేఏ పాల్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమీపంలో ధర్నా నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఆకస్మికంగా రోడ్డుపైన కేఎ పాల్ కనపడడంతో జనం ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. మణుగూరు సమీపంలోని పగిడేరులో ప్రజాశాంతి పార్టీ సమావేశానికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

మార్గమధ్యలో సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరం కనబడడంతో తన వాహనాన్ని ఆపి వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంతరెడ్డి ఇచ్చిన హామీలని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన పత్రిక ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణలో రానున్న సర్పంచ్ ఎలక్షన్లలో ప్రజాశాంతి పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను ఎన్నికలలో పోటీ చేయిస్తున్నట్లు ప్రకటించారు.


Similar News