నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తా

కొత్తగూడ నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు.

Update: 2024-10-24 09:55 GMT

దిశ, పాల్వంచ రూరల్ : కొత్తగూడ నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. గుడిపాడు గ్రామంలో గురువారం ఆయన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని, ప్రాథమిక పాఠశాల పహరీ నిర్మించాలని, సీసీ రోడ్డు మంజూరు చేయాలని, శ్రీనివాస్ కాలనీ నుంచి గుడిపాడు గ్రామం వరకు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని, ముర్రేడు వంతెనకు మరమ్మతులు చేయించాలి వంటి సమస్యలను జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్, సామాజిక సేవా కార్యకర్త మోక్ష ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దాంతో ఎమ్మెల్యే అన్ని సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సభ్యులు నాగ సీతారాములు, స్థానిక మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News