తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపించింది కమ్యూనిస్టులే
తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపించింది కమ్యూనిస్టులు అని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
దిశ, ఖమ్మం టౌన్ : తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపించింది కమ్యూనిస్టులు అని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన పార్టీ ఖమ్మం నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం నిజాం రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది కేవలం కమ్యూనిస్టులు మాత్రమే అని, కానీ ఈనాడు బీజేపీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి చెబుతుంది అని విమర్శించారు. నిజాం నవాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు
అని, పేద ప్రజలపై దాడులు చేసి వేలాది మందిని పొట్టన పెట్టుకున్నారని, అలాంటి టైం లో కమ్యూనిస్టులు మాత్రమే ప్రజలకు అండగా ఉండి ప్రజల కోసం వేలాది మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలు ప్రాణాలు అర్పించారు అని పేర్కొన్నారు. ఈ నెల 16న భక్త రామదాసు కళాక్షేత్రంలో భారీ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి వందలాది కార్యకర్తలు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. విక్రమ్, నాయకులు యర్రా శ్రీనివాసరావు, జబ్బర్, భుక్యా శ్రీనివాస్ రావు, డి. తిరుపతి రావు, నవీన్ రెడ్డి , మీరా సాహిబ్, బోడపట్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.