'కాంగ్రెస్‌లోకి తుమ్మలను ఆహ్వానిస్తున్నాం'.. విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి

కాంగ్రెస్ పార్టీలో ఈ నెల 17న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆయన సోమవారం రావడం జరిగింది.

Update: 2023-09-25 14:38 GMT

దిశ, ఖమ్మం సిటీ: కాంగ్రెస్ పార్టీలో ఈ నెల 17న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆయన సోమవారం రావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినాయకత్వం ఆధ్వర్యంలో మాజీ మంత్రి తుమ్మల పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతేకాక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల కార్డు పై స్పష్టమైన వివరణ ఇచ్చారు. గ్యారంటీ లు అన్ని కూడా ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఆరు గ్యారంటీల కార్డు అధికారంలోకి రాగానే ప్రజలకు అమలు చేసే విధానం వివరించారు. ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలాల్లో 10 నుంచి 15 ఎకరాల్లో కట్టడం జరుగుతుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కార్డును ప్రతి ఒక్కరు మూడునెలల భద్ర పరుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ గ్యారంటీలపై పెద్ద ఎత్తున అధ్యాయనం చేసిన తరువాతనే మ్యానిఫెస్టోను ప్రకటించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తధ్యం వచ్చిన అధికారం తో ప్రజలకు మెరుగైన పాలన కొనసాగిస్తామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ చేసిన అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

రాష్ట్ర సంపదను, వనరులను కాపాడాలని కాంగ్రెస్ భావిస్తుందని వాటిని దోచుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంది విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భావించే వారు కాంగ్రెస్ వైపు వస్తున్నారని హితవు పలికారు. కాంగ్రెస్ ద్వారా ధర్మం గెలవబోతా ఉంది ప్రజలు గెలవబోతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రావ్యాప్తంగా 74 నుంచి 78 సీట్లు కైవసం చేసుకోబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్ మెంట్‌తో పాటు అదనంగా రూ.5 లక్షలు అందజేస్తాం అన్నారు. స్కూల్‌కు వచ్చే పిల్లలకు బస్సుల సౌకర్యం కలిపిస్తాం. తెలంగాణలో సంపద ఉంది కాబట్టి అమలు చేస్తాం.. బీఆర్ఎస్ లాగా మాయ మాటల స్కీంలు ప్రకటించడం లేదన్నారు. కాంగ్రెస్‌ను చూసి బీఆర్ఎస్ నాయకులు ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. వంద శాతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. బీఆర్ఎస్ అక్రమంగా అమ్మిన భూముల పై చట్టపరంగా చర్యలు తీసుకోని ప్రజలకు పంచుతామన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కాంగ్రెస్ 40 సంవత్సరాలుగా కార్యకర్తల జిల్లా ప్రజలు, జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం నన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత 40 యేళ్లుగా నిబద్దతత కలిగిన వ్యక్తిగా, అభివృధ్దే ధ్యేయంగా రాజకీయ జీవితాన్ని వాడాను అన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకత్వం నన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. ఏ అవసరం కోసం నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారో వారి నమ్మకాన్ని నిలబెడతానని హామిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం రాష్ట్ర హై కోర్టు గ్రూప్-1 రద్దు చేస్తూ.. ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టని కాంగ్రెస్ భావిస్తుందన్నారు. రాష్ట్ర సంపదను దోచుకోని, మభ్య పెట్టి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ భావిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన యువతను బీఆర్ఎస్ గాలికొదిలేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు.

నీఛాతీ నీఛంగా, బజారులో బటానిల్లాగా గ్రూప్ వన్ పరీక్ష పేపర్లను బీఆర్ఎస్ అమ్ముకున్నదని అన్నారు. నిరుద్యోగులకు కోచింగ్‌కు అయిన ఖర్చులను బీఆర్ఎస్ ఇవ్వలేదన్నారు. యువత పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నదని.. ఐటీలో బీఆర్ఎస్ క్యాబినేట్ మంత్రి అసమర్థత బయట పడింది సాఫ్ట్ వేర్ తప్పిదంతో 25 మంది పదవ తరగతి విధ్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడానికి కారుకులయ్యారన్నారు. యువత, విధ్యార్ధులు నిరుత్సాహ పడకండి.. కాంగ్రెస్ మీకు అండగా నిలబడబోతుందని హామిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నగర అధ్యక్షులు జావిద్, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు, తదితరులు పాల్గొన్నారు.


Similar News