న్యూ లిటిల్ ఫ్లవర్స్ కళాశాలలో అడ్మిషన్ వేడుకలు

వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ సిబిఎస్ఈ కళాశాలలో బుధవారం అడ్మిషన్

Update: 2024-10-09 16:07 GMT

దిశ, వైరా : వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ సిబిఎస్ఈ కళాశాలలో బుధవారం అడ్మిషన్ వేడుకలు జరిగాయి. ఎంతో సామర్థ్యం ఉన్న అధ్యాపకులతో సిబిఎస్ఈ కళాశాలను నిర్వహిస్తున్నారు. అయితే దసరా సందర్భంగా వచ్చే విద్యా సంవత్సరం కోసం అడ్మిషన్లను ప్రారంభించారు. బుధవారం ఒక్కరోజే సుమారు 50 అడ్మిషన్లను విద్యార్థినీ విద్యార్థులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా పాఠశాల కరస్పాండెంట్ పోతినేని భూమేశ్వర రావు, రమాదేవి దంపతులతో పాటు డైరెక్టర్ కుర్రా సుమన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అడ్మిషన్లను వారు ప్రారంభించారు.

ఈ పాఠశాల స్థాపించినప్పటి నుంచి ఇక్కడే చదువుతున్న అనేకమంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో సి బి ఎస్ ఈ చదువుతున్న అనేకమంది విద్యలో ముందున్న విద్యార్థులు ఇక్కడే అడ్మిషన్లు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు మాట్లాడుతూ సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ లో ఎంతో నైపుణ్యం ఉన్న అధ్యాపకులతో తమ కళాశాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే రెండు సంవత్సరాలలో తమ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధిస్తారని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తమ కళాశాలపై నమ్మకం ఉంచి అడ్మిషన్ చేసిన తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థినీ విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు.


Similar News