దిశ కథనం పై ఇంటిలిజెన్సీ అధికారుల ఆరా..

ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్.149 లో ఆరు ఎకరాల ఎన్ఎస్పీ భూమి ఆక్రమిస్తున్నారు అనే విషయం పై ఇంటిలిజెన్సీ అధికారులు ఆరా తీశారు.

Update: 2023-05-08 11:37 GMT

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్.149 లో ఆరు ఎకరాల ఎన్ఎస్పీ భూమి ఆక్రమిస్తున్నారు అనే విషయం పై ఇంటిలిజెన్సీ అధికారులు ఆరా తీశారు. గ్రానైట్ క్వారీ యాజమానికున్న అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దీంతోపాటు గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఇతర నాయకుల ఎవరెవరు పాత్ర ఏంటి అనే దాని పై ఆరాతీస్తున్నట్టు తెలుస్తున్నది.

గ్రానైట్ క్వారీ యజమాని దగ్గర నుంచి పెద్దమొత్తంలో నలుగురు వ్యక్తులు బ్లాక్మెయిలింగ్ కి పాల్పడి నగదు, తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సంబంధిత ఎన్ఎస్పీ అధికారులతో కూడా ఇంటిలిజెన్సీ అధికారులు మాట్లాడినట్టు విశ్వసనీయ సమాచారం. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఎన్ఎస్పీ భూమికి సంబంధించిన ఆక్రమణ విషయం పై రాష్ట్ర లోకాయుక్తనీ కూడా ఆశ్రయించడానికి గ్రామస్తులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అక్రమదారు నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News