మిషన్ భగీరథపై పిల్లర్ నిర్మాణం.. ఎవరు అడ్డొచ్చిన తగ్గేదేలే: అధికార పార్టీ నేత

దిశ, ముదిగొండ: ఆయన అధికార పార్టీ నేత తన భూమికి పక్కనే కొంత ప్రభుత్వ భూమి ఉన్నది తమ పార్టీదే ప్రభుత్వం కావటంతో..latest telugu news

Update: 2022-06-06 14:51 GMT

దిశ, ముదిగొండ: ఆయన అధికార పార్టీ నేత తన భూమికి పక్కనే కొంత ప్రభుత్వ భూమి ఉన్నది తమ పార్టీదే ప్రభుత్వం కావటంతో.. ప్రభుత్వ భూమి కూడా తమదే అనుకున్నాడో ఏమో దర్జాగా కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిదిలోని మాధాపురం గ్రామంలో ఓ అధికార పార్టీ నేత గ్రామంలోని రైతు వేదిక ఎదురుగా ఇటీవల 600 గజాల ప్రైవేట్ భూమిని కొనుగోలు చేశాడు. ఆ స్థలం పక్కనే ఎప్పటి నుంచో ఉన్న ప్రభుత్వానికి చెందిన దారిని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టాడు. అందుకు మరికొందరు పార్టీ పెద్దలు కూడా మద్దతివ్వడంతో తనకు అడ్డుండదనుకుంటూనే మిషన్ భగీరథ గేట్ వాల్వ్‌ను సైతం పూడ్చి పిల్లర్ నిర్మాణం చేశాడు.

సదరు భూమి అమ్మిన వ్యక్తి సరిహద్దులు చూపించినా పట్టనట్లు వ్యవహరిస్తూ దారి ఆక్రమణకు గురిచేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసి గ్రామ సర్పంచ్ సదరు వ్యక్తిని గ్రామ అవసరాలకు ఉపయోగపడే దారిని ఆక్రమించడం ఏంటని ప్రశ్నించగా, వారం రోజుల్లో తొలగిస్తానని చెప్పాడు. వారం రోజులు దాటినా ఆక్రమణ తొలిగింకపోయి ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ నిర్మాణం పూర్తి అయితే భవిష్యత్తులో భగీరథ నీటి నిర్వహణ సమస్యగా మారనుంది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పంచాయతీ సెక్రటరీ నోటీసు ఇవ్వగా, ఆ నోటీసు తీసుకోకపోగా.. ఇంటి నిర్మాణం ఎవరు అడ్డొచ్చిన ఆపను నా వెనక చాలా పెద్దవాళ్ళు ఉన్నారని బెదిరించటం కొసమెరుపు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులపై ఒత్తిడి ఉండటంతో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనా పట్టించుకోవటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.


Similar News