ఇల్లందు గడ్డ.. కాంగ్రెస్ అడ్డా

కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ప్రజలు వెంట రాగా రైతులను, కూలీలను, ఆటోడ్రైవర్లను, ఆర్టీసీ డ్రైవర్లను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ హామీలిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జొడో పాదయాత్ర శనివారం ఇల్లందులో కొనసాగింది.

Update: 2023-02-11 16:13 GMT

హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీపీ చీఫ్ రేవంత్ రెడ్డి

దిశ, ఇల్లందు: కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ప్రజలు వెంట రాగా రైతులను, కూలీలను, ఆటోడ్రైవర్లను, ఆర్టీసీ డ్రైవర్లను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ హామీలిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జొడో పాదయాత్ర శనివారం ఇల్లందులో కొనసాగింది. మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ బస ప్రాంతం నుంచి ఉదయం 7.30 గంటలకు సింగరేణి జేకే-5 ఓసీని సందర్శించి ఐ ఎన్ టీయూసీ జెండాను ఆవిష్కరించారు.

కార్మికుల హక్కులను కాపాడేది కాంగ్రెస్ పార్టీనే..

బొగ్గు గనులకు పుట్టినిల్లు ఇల్లందు అన్నారు. సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికుల త్యాగం మరవలేమని, మీ శ్రమతో వచ్చిన తెలంగాణలో మీకే అన్యాయం జరుగుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఓపెన్ కాస్ట్ ను మూసివేసి అండర్ గ్రౌండ్ మైన్ లను ప్రారంభిస్తామన్నారు. సింగరేణి సంస్థలో 70 వేల మంది కార్మికుల నుంచి 40 వేల కార్మికుల వరకు తగ్గిస్తూ వచ్చారని గుర్తు చేశారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ 8 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బయటకు తీస్తామన్నారు. సింగరేణి కార్మికులకు పనికి తగిన వేతనం రావడం లేదన్నారు. ఓపెన్ కాస్ట్ మైన్ ల టెండర్లను తన కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీలైన అరబిందో, నైని కంపెనీలకు కట్టబెడుతూ రూ.కోట్లు సంపాదించారు. 2017 నుంచి రిటైర్డ్ అయిన సింగరేణి కార్మికుల గ్రావిటీ ఇప్పటికీ అందలేదని ఆరోపించారు. సింగరేణి కి సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా అన్ని పార్టీలతో చర్చించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతామన్నారు. అనంతరం రాజీవ్ నగర్ చేరుకున్న రేవంత్ రెడ్డిని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిసి మాట్లాడారు. తమకు సీపీఎస్ విధానంతో ఇబ్బందులు ఉన్నాయని దాన్ని తొలగించాలని కోరారు. జీవో నెం.317 జీవో ద్వారా ఉద్యోగులకు కొత్త సమస్య వచ్చిందన్నారు. షెడ్యూల్ ఏరియాలో షెడ్యూల్ ట్రైబల్స్ మాత్రమే ఉద్యోగ అవకాశాలు పదోన్నతులు కల్పించాలని, ఉపాధ్యాయ , ఉద్యోగ బదిలీల ఏజెన్సీ మైదాన ప్రాంతాలుగా నిర్వహించాలని, గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు షెడ్యూల్ ప్రకటించాలని, మైదాన ప్రాంతంలో ఎస్టీ ఉపాధ్యాయులకు నూతన జిల్లాలో నూతన రోస్టర్ తో పదోన్నతులు కల్పించాలని తదితర అంశాల మీద వినతి పత్రం అందజేశారు. గిరిజన విద్యార్థులకు సరైన భోజనం, విద్య అందించాలని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని టీఎస్ టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ , టీఎస్ ఏటీఎఫ్ జనరల్ సెక్రెటరీ కబ్బాకుల రవి కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ బూత్ కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించి ఇల్లందులో పార్టీ బలంగా ఉందన్నారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని ఇల్లందు నియోజకవర్గ ప్రజలు అక్కున చేర్చుకున్నారని గుర్తు చేశారు. ఇన్నాళ్లు కష్టాలను ఎదుర్కొన్న మీరు మరో 10నెలలు పార్టీ కోసం సైనికులుగా పనిచేయాలన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మన పార్టీయే అన్నారు. అనంతరం రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చిన టీడీపీ నాయకులు కోమరారం, సుదిమల్లను మండలాలు, ఇల్లందు రెవెన్యూ చేయాలని రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

ఇల్లందు మండలం రాజీవ్ నగర్ నుంచి సాయంత్రం 5గంటలకు పాదయాత్ర ఇల్లందు పట్టణ వైపు సాగింది. ఈ క్రమంలో సీఎస్పీ బస్తీ, డీ.ఎస్పీ ఆఫీస్, గోవింద్ సెంటర్, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ , జగదాంబ సెంటర్ లో కార్నర్ మీటింగ్ వరకు పాదయాత్ర సాగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పూలతో, గజమాలతో రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఇల్లందు పట్టణం జగదాంబ సెంటర్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇస్తానని 2014 నుంచి మాయ మాటలు చెబుతూ తొమ్మిది సంవత్సరాలు గడచిన ఇప్పటికి పట్టాలివ్వలేదన్నారు. జూడో యాత్ర ఐదు రోజులుగా సాగుతున్న ఆదివాసుల పోడు భూములకై కోసం పాదయాత్ర నిరంతరం మాట్లాడడం గమనించిన కేసీఆర్ చేసేది లేక నిన్న అసెంబ్లీలో పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నారు పేర్కొన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో కలుపుతానని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు పంపామన్నారు. ఇన్ని సంవత్సరాలు గుర్తుకురాని కేసీఆర్ కు పోడు భూములు, వాల్మీకి బోయ కులస్థులు ఎన్నికల సమీపించడంతో అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నారన్నారని తెలిపారు. ఏ ఒక్క గ్రామంలో కూడా డబల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని, పాదయాత్ర కలిసిన ప్రతి ఒక్క మహిళ కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లులు మాత్రమే ఇచ్చారన్నారు. 2014 నుంచి రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంతవరకు రుణమాఫీ చేయలేదన్నారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యాధులకు పేద ప్రజల కోసం ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువస్తే దాన్ని అమలు చేయకుండా రూ.800 కోట్ల బకాయిలు చేసిందన్నారు. ఇల్లందులో గతంలో సింగరేణి కార్మికులు 8వేల మంది ఉంటే నేడు 600 మందికి సింగరేణి కార్మికులు చేరారన్నారు. గిరిజనులకు ఆరు శాతం రిజర్వేషన్ నుంచి 12% రిజర్వేషన్ పెంచుతానని చెప్పి 9 సంవత్సరాలైనా ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తాటి వెంకటేశ్వర్లు, వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, సంభాని చంద్రశేఖర్, నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మానవత రాయ్, విజయ రమణారావు, చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ రవి నాయక్, దల్ సింగ్, లక్కినేని సురేందర్, మంగీలాల్ నాయక్, శంకర్ నాయక్, ఎడవల్లి కృష్ణ, లింగాల జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News