మత్తు పదార్థాలు ఉంటే జాగిలాలకు చిక్కినట్టే

మత్తు పదార్థాలను కనిపెట్టేందుకు జాగిలాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

Update: 2024-11-06 11:32 GMT

దిశ,టేకులపల్లి : మత్తు పదార్థాలను కనిపెట్టేందుకు జాగిలాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు గంజాయి, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ ను కనిపెట్టేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలాలతో టేకులపల్లి మండలంలోని పాత గంజాయి నేరస్తుల ఇళ్లల్లో, నిర్మాణుష్య ప్రదేశాలలో టేకులపల్లి సీఐ తాటిపాముల సురేష్, ఎస్సై పోగుల సురేష్, జాగిలం హ్యాండ్లర్ వెంకటేష్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

     అనంతరం సీఐ మాట్లాడుతూ యువత భవిష్యత్​ను నాశనం చేస్తూ అక్రమార్జనే ధ్యేయంగా నిషేధిత గంజాయిని రవాణా చేసే వ్యక్తులను పట్టుకోవడానికి వాహన తనిఖీలు చేపట్టడంతో పాటు పోలీస్ జాగిలాల సహాయం తీసుకుంటున్నట్టు చెప్పారు. టేకులపల్లిలో మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని అన్నారు. ఈ తనిఖీలలో టేకులపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 


Similar News