survey : నేటి నుంచి ఇంటింటి సర్వే..
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వేను ఇంటింటా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది.
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వేను ఇంటింటా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, తెగలు, ఇతర బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా మొత్తం 75 అంశాలతో వివరాలు సేకరించేలా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని, పదిమంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ చొప్పున నియమించింది. ఈ సర్వే సుమారు 15 రోజుల పాటు జరగనున్నది. సర్వే సిబ్బంది ఒక ఇంటికి 30 నిమిషాల సమయం తీసుకుని, రోజుకు 10 ఇండ్లు సర్వే చేస్తారు. ఒక్కో సర్వే సిబ్బందికి 150 ఇండ్లు కేటాయించారు. జిల్లాలో పక్కాప్రణాళికతో, ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వకుండా సర్వే పూర్తి చేయాలని అధికారులకు ఇప్పటికే కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. సర్వే ముగియగానే రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ తుది నివేదికను సమర్పించనున్నారు.
దిశ, ఖమ్మం సిటీ : నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా కుటుంబాల సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ సర్వేను ఇంటింటా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా రంగం సిద్ధం చేసింది. నేటి నుంచి జరిగే ఈ సర్వే సుమారు 15 రోజుల పాటు నిర్వహించేందుకు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించింది. సర్వే ముగియగానే రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ముజామిల్‌ఖాన్ తుది నివేదికను సమర్పించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 3654 ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజన చేసి సర్వే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి సుమారు 3719 మంది ఎన్యూమరేటర్లు పనిచేయనున్నారు. ప్రభుత్వ పరిధిలో పనిచేసే ప్రతి అధికారి ఈ సర్వేలో పాల్గొనున్నారు. పదిమంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ చొప్పున 314 మంది సిబ్బందిని నియమించారు. 150 ఇండ్లకు సంబంధించి ఒక ఎనిమరేషన్ బ్లాక్ గా పరిగణిస్తారు ఒక్కో ఎన్యూమరేటర్కు రోజుకు 10 గృహాల చొప్పున 15 రోజులకు, 150 గృహాలు పూర్తి చేయాల్సి ఉంటంది.
ప్రతి ఎన్యూమరేటర్ కు ఒక్కో బ్యాగ్ ను అందించగా దానిలో స్టేషనరీ తో సహా సర్వే కాపీలు ఉంటాయి. సర్వే వివరాలు ఏరోజుకారోజు మండలాల వారిగా ప్రత్యేకంగా నియమించిన ఆపరేటర్లతో ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. సర్వే నిర్వహించే ప్రాంతాల్లో ఒకరోజు ముందుగానే చాటింపు వేయించి ప్రజలందరూ అందుబాటులో ఉండే విధంగా అన్ని ధ్రువపత్రాలు దగ్గరగా ఉంచుకోవాలని వారికి సూచించేలా చర్యలు చేపడుతున్నారు. సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికిస్తారు. మరి ముఖ్యంగా 75 అంశాలపై వివరాల సేకరణ చేసేందుకు వెనుకబడిన తరగతులు షెడ్యూల్ కులాలు తెగలు ఇతర బలహీన వర్గాల సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం సర్వే చేపడుతుందని సిబ్బందికి అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని 6,33,304 కుటుంబాలకు సంబంధించిన 75 అంశాలపై అధికారులు వివరాలను సేకరించినన్నారు. కుటుంబ యజమానితో పాటు సభ్యుల వ్యక్తిగత వివరాలను నమోదు చేస్తారు. అంతేకాక విద్య, ఉద్యోగ, ఉపాధి ,కులవృత్తుల భూములు, గత ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాల వివరాలతో పాటు ఆయా కుటుంబాల రాజకీయ నేపథ్యం తదితరాలను పొందుపరుస్తూ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనే కాకుండా ప్రభుత్వ పథకాల అమలుకు ఈ సర్వే ఉపకరిస్తుందని తెలుస్తోంది.
రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 15 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కాప్రణాళికతో, ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులకు తెలిపారు. ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో సుమారు 6,33,304 కుటుంబాలున్నట్లు అంచనా ఉందన్నారు. ప్రతి ఇంటి సర్వేకు పటిష్ట ప్రణాళిక చేశామన్నారు. 3654 ఇబిలుగా చేపట్టి, 3719 ఎన్యుమరేటర్లను, 314 మంది సూపర్వైజర్ల, 5 గురు నియోజకవర్గ అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు. వివిధ శాఖల నుంచి గెజిటెడ్ అధికారులను సూపర్‌వైజర్లుగా, వివిధ శాఖల సిబ్బందిని ఎన్యుమరేటర్లలుగా నియమించామన్నారు. ఖమ్మంకు డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, పాలేరుకు అదనపు డీఆర్డీఓ నూరోద్దీన్, వైరాకు డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, సత్తుపల్లికి కల్లూరు ఆర్డీవో రాజేందర్, మధిర నియోజకవర్గ బాధ్యులుగా ఖమ్మం ఆర్డీవో నర్సింహారావులను నియయించినట్లు ఆయన అన్నారు.
ఒక ఎన్యుమరేషన్ బ్లాక్‌కు ఒక సర్వేయర్ ఉండాలన్నారు. సర్వేలో 75లో ప్రశ్నలు ఉన్నట్లు, ఒక ఇంటి సర్వేకు 30 నిమిషాల సమయం, రోజుకు ఒక సర్వేయర్ 10 ఇండ్ల సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో ఇండ్ల లిస్టింగ్ పూర్తి చేయాలన్నారు. ఒక్కో సర్వేయర్ కు 150 ఇండ్లు కేటాయించామన్నారు. రోజువారి లక్ష్యం పెట్టుకొని, 15 రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంచాలని, వీరిని మండల స్టాటిస్టిక్ అధికారులు పర్యవేక్షణ చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఏ దశలో పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు ఎప్పటికప్పుడు సూపర్ చెక్ చేపడుతూ, పర్యవేక్షణ చేస్తూ, వారికి కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు.