రోగులను ఆప్యాయంగా పలకరించాలి
ఆసుపత్రికి వచ్చే రోగులను ఆప్యాయంగా పలకరించి వారి రోగాన్ని నయం చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ కళావతి బాయి అన్నారు.
దిశ, ఖమ్మం : ఆసుపత్రికి వచ్చే రోగులను ఆప్యాయంగా పలకరించి వారి రోగాన్ని నయం చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ కళావతి బాయి అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రాంతంలోని అర్బన్ హెల్త్ సెంటర్ ను సందర్శించారు.
హెల్త్ సెంటర్ లో రోగులకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లలకు సరైన వాక్సినేషన్ అందించాలని ఆదేశించారు. గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందించేందుకు ఏఎన్ఏం సిబ్బంది కృషి చేయాలన్నారు. ల్యాబ్ రిపోర్ట్ లు రోగులకు సకాలంలో అందించాలన్నారు. అనంతరం రూరల్ మండలంలోని ఎదులాపురం సబ్ హెల్త్ సెంటర్, అంగన్వాడీలను సందర్శించారు.