విద్యారంగంలో న్యూ లిటిల్ ఫ్లవర్స్‌కు ప్రత్యేక స్థానం
ఖమ్మం జిల్లా విద్యారంగంలోనే వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలకు ప్రత్యేక స్థానం ఉందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు.
దిశ, వైరా : ఖమ్మం జిల్లా విద్యారంగంలోనే వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలకు ప్రత్యేక స్థానం ఉందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులతో ఈ విద్యా సంస్థ రాష్ట్రస్థాయి ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని కొనియాడారు. ఈ పాఠశాల స్థాపించిన అనతి కాలంలోనే ఉత్తమ ఫలితాలతో ఎంతో కీర్తి ప్రతిష్టలను సాధించిందని చెప్పారు. పదో తరగతితో పాటు, పోటీ పరీక్షల్లో ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో తమ సత్తాను చాటుతున్నారని వివరించారు. ఈ పాఠశాల ఖమ్మం జిల్లాకే తలమానికంగా నిలిచిందని కొనియాడారు. విద్యతోపాటు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. తెలుగుతనం ఉట్టిపడేలా ఈ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ పాఠశాలలో ప్రదర్శించిన పూరిల్లు, రంగవల్లులు, ఎడ్ల బండి, ఎడ్లు, డుడు బసవన్నలు, బొమ్మల కొలువుతో పాటు విద్యార్థినీ విద్యార్థుల సాంప్రదాయ దుస్తుల అలంకరణలు పల్లెటూరి వాతావరణానికి జీవం పోసినట్లుగా ఉన్నాయని కొనియాడారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు అందిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు పాఠశాల కరస్పాండెంట్ పోతినేని భూమేష్ రావు, డైరెక్టర్లు కుర్రా సుమన్, కాపా మురళీకృష్ణ, లగడపాటి ప్రభాకర్ రావు పూలమాలవేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ పాఠశాల లోగిళ్లలో సంక్రాంతి శోభ ఉట్టి పడింది. గ్రామీణ ప్రాంత వేషధారణలతో విద్యార్థిని విద్యార్థులు ఆకట్టుకున్నారు. లక్ష్మీ పూజతో ప్రారంభమైన సంబరాలు పాలు పొంగించుకొని పొంగలని అమ్మవారికి నైవేధ్యంగా సమర్పించారు. అనంతరం భోగి మంటలు వెలిగించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కోడిపందేల ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బీడీకే రత్నం, దాసరి దానియేలు, శ్రీరామనేని భాస్కర్, మిట్టపల్లి నాగి, కర్నాటి హనుమంతరావు, దార్న రాజశేఖర్, చెరుకూరి కిరణ్, కన్నెగంటి హుస్సేన్, సర్పంచ్ సాధం రామారావు, పాఠశాల కరస్పాండెంట్ పోతినేని భూమేశ్వరరావు, డైరెక్టర్లు కుర్రా సుమన్, కాపా మురళీకృష్ణ లగడపాటి ప్రభాకర్, ప్రిన్సిపాల్ షాజి మాథ్యూ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సామినేని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.