బీఆర్ఎస్ పార్టీకి పలువురు నాయకులు గుడ్ బై..

పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ అయిన మరునాడే ఖమ్మం జిల్లాలో రాజీనామాల పర్వం మొదలైంది.

Update: 2023-04-11 13:29 GMT

దిశ, కామేపల్లి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ అయిన మరునాడే ఖమ్మం జిల్లాలో రాజీనామాల పర్వం మొదలైంది. దానిలో భాగంగా పొంగులేటి వర్గం నాయకులు మాజీ జెడ్పీటీసీ, ప్రస్తుత డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పొంగులేటి శ్రీనన్నను ఉపయోగించుకున్నన్ని రోజులు ఉపయోగించుకుని తరువాత తడిగుడ్డతో గొంతు కోసినట్లుగా, నమ్మకద్రోహం చేశారన్నారు. ఆయన ద్వారా ఎంతో రాజకీయ లబ్ధిపొంది తరువాత సస్పెండ్ చేసిందని అన్నారు. అలాంటి వ్యక్తిని అవమానించినందుకు బాధాకరంగాఉన్నదని, ఆయన వెంట నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేదని ప్రజల ముందు ఆ పార్టీని దోషిగా నిలబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్ పెట్టిన దళిత బంధు ఎక్కడ అమలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో చేరాయని విమర్శించారు. ఆయనతో పాటు మత్స్యశాఖ సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, మాజీ ఉపసర్పంచ్ ధరావతులాలు, మాజీ వార్డ్ మెంబర్లు బండి ఉపేందర్, ప్రస్తుత వార్డు మెంబర్ బానోతు లక్ష్మనాయక్, చల్ల మల్లయ్య, చింతల పెద్ద వెంకయ్య, బాదావత్ నాగరాజు, రాయల నాగ శంకర్, పగిడిపల్లి రాములు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

Tags:    

Similar News