యువతకు ఉద్యోగాలు ఇవ్వని ద్రోహి CM KCR: మాజీ MP Pongulati Srinivas Reddy ఫైర్

మూడు రంగుల జెండా కాంగ్రెస్ జెండాతోనే పేద ప్రజలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో-చైర్మన్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Update: 2023-08-11 03:51 GMT

దిశ, మణుగూరు: మూడు రంగుల జెండా కాంగ్రెస్ జెండాతోనే పేద ప్రజలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో-చైర్మన్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని హనుమాన్ ఫంక్షన్ హల్‌లో భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ తుళ్లూరి బ్రమ్మయ్య అధ్యక్షతన నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశానికి ముందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కొత్త కొత్త పథకాలు, హామీలు సృష్టించి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన కాలంలో లేని పథకాలు నేడు ఎలా ప్రవేశ పెడుతున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో సీఎంగా గెలవాలని ఉద్దేశంతోనే లేని పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలను ఖునీ చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ మాటలు తుపాకీ రాముడి మాటాలని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు లేవని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు ఆసరా ఫించన్, పేదలకు డబుల్ బెడ్ రూమ్స్, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని ద్రోహి సీఎం కేసీఆర్‌రన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెప్పుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని తెలిపారు.

ప్రజలారా ఆలోచన చేయండి.. కేసీఆర్ ప్రభుత్వాన్ని నమ్మకండని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందించిన ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ, 500కే గ్యాస్, ఉచిత కరెంట్, మహిళలకు రుణాలు తదితర పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎంపీపీ ముత్తునేని సుజాత, మాజీ ఎమ్మెల్యే, జెడ్పి చైర్మన్ చందా లింగయ్య, నాయకులు కరివేద వెంకటేశ్వర్లు, పుచ్చకాయల శంకర్, బట్ట విజయాగాంధీ, కాటబోయిన నాగేశ్వరరావు, చందా సంతోష్, పోలేబొయిన శ్రీవాణి, సుజాత, బోగినేని వరలక్ష్మి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : ఎన్నికల వేళ సర్కార్‌కు ‘TSPSC’ గండం.. యువత దూరం అవుతోందని BRS లో కొత్త టెన్షన్..!

Tags:    

Similar News