ఫ్లూ జ్వరంతో వణుకుతున్న గ్రామాలు.. ఇంటికో బాధితుడు

వైరా మండలం వల్లాపురం గ్రామాన్ని ఫ్లూజ్వరాలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా ఈగ్రామంలో దగ్గు, గొంతు నొప్పి, జలుబుతో కూడిన జ్వరాలు వేధిస్తున్నాయి. ఇప్పటివరకు 300మందికి

Update: 2023-03-08 02:41 GMT

వైరా మండలం వల్లాపురం గ్రామాన్ని ఫ్లూజ్వరాలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా ఈగ్రామంలో దగ్గు, గొంతు నొప్పి, జలుబుతో కూడిన జ్వరాలు వేధిస్తున్నాయి. ఇప్పటివరకు 300మందికి పైగా ఇటువంటి లక్షణాలతో అల్లాడుతున్నారు. ప్రతి ఇంటి తలుపును ఫ్లూ జ్వరం తట్టడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈలక్షణాలతో రాత్రి వేళల్లో అనారోగ్యానికి గురైన వారికి కంటి మీద కునుకు లేకుండా పోతున్నది. శ్వాస సంబంధించిన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులల్లో కనీస చలనం కరువైందనే విమర్శలు వస్తున్నాయి. గ్రామంలో అత్యధికంగా జ్వర పీడితులు ఉన్నా.. ఆశా వర్కర్లు వైద్యాధికారులకు సమాచారం పూర్తిస్థాయిలో అందించడం లేదనే ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. మరోవైపు బాధితులు గొల్లపూడితో పాటు వైరాలోని ప్రైవేట్ ఆసుపత్రిల్లో ప్రాథమిక చికిత్స చేయించుకుంటున్నట్లు తెలుస్తున్నది.

దిశ, వైరా: దగ్గు, గొంతు నొప్పి, జలుబుతో కూడిన ఫ్లూ జరాలు వైరా మండలంలోని వల్లాపురం గ్రామాన్ని వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా ఈ గ్రామంలో జ్వర పీడితుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నది. ఇప్పటివరకు ఈ గ్రామంలో300 మందికి పైగా ఫ్లూ జ్వరాలతో అల్లాడుతున్నారు. ప్రతి ఇంటి తలుపును ఫ్లూ జ్వరం తట్టడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ గ్రామంలో సుమారు 350 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే కొన్ని కుటుంబం మినహా మిగిలిన కుటుంబాలను ఫ్లూ జ్వరం వేధిస్తోంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో జ్వరం రావడంతో ప్రజలు తీవ్ర ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ లక్షణాలతో రాత్రి వేళల్లో అనారోగ్యానికి గురైన వారికి కంటి మీద కునుకు లేకుండా పోతున్నది. ఈ జ్వరంతో గ్రామస్తులకు శ్వాస సంబంధించిన సమస్యలు ఏర్పడుతున్నాయి.

ఫ్లూ జ్వరం వచ్చి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న గ్రామానికి చెందిన ఇద్దరిని ఇటీవల ఖమ్మం లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వల్లాపురాన్ని ఫ్లూ జ్వరం దాడి చేసినంత పని చేస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులుల్లో కనీస చలనం కరువైంది. గ్రామంలో అత్యధికంగా జ్వర పీడితులు ఉన్నా... ఆశా వర్కర్లు వైద్యాధికారులకు సమాచారం పూర్తిస్థాయిలో అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జ్వరాల బారిన పడినవారు తమంత తాముగా గొల్లపూడితో పాటు వైరాలోని ప్రైవేట్ ఆసుపత్రిల్లో ప్రాథమిక చికిత్స చేయించుకుని తమ ఇళ్లకు వెళ్లి బెడ్ రెస్ట్ లో ఉంటున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి వల్లాపురంలో జ్వర బాధితుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఫ్లూ జ్వరాల నియత్రణకు చర్యలు తీసుకోవాలి: దిశఎఫెక్ట్

వైరా మండలంలోని వల్లాపురం గ్రామంలో ఫ్లూ జ్వరాలను నియంత్రించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాలతిని ఆదేశించారు. "వల్లాపురాన్ని వణికిస్తున్న ఫ్లూ జ్వరాలు" అనే శీర్షికతో మంగళవారం రాత్రి దిశలో వచ్చిన వార్త కథనంపై గంట వ్యవధి గడవకముందే కలెక్టర్ వీపీ గౌతమ్ స్పందించారు. వెంటనే జిల్లా వైద్యాధికారి మాలతీని వల్లాపురంలో ఫ్లూ జ్వరాలను అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే జిల్లా వైద్యాధికారిణి మాలతి దిశ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జితో ఫోన్లో మాట్లాడి జ్వరాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. బుధవారం వల్లాపురం గ్రామంలో తమ వైద్య బృందం పర్యటిస్తుందని మాలతి స్పష్టం చేశారు. సమస్య తెలిసిన గంటలోపే స్వయానా కలెక్టర్ రాత్రి సమయంలో స్పందించి, జ్వరాలను అరికట్టేలా డీఎంహెచ్ఓకు ఆదేశాలు జారీ చేయడంతో విధుల పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధ మరోసారి స్పష్టమైంది.

Tags:    

Similar News